: సాక్షాత్తూ మోదీ వచ్చి రాజ్యసభకు పంపిస్తానన్నా నేను జగన్ కే ప్రచారం చేస్తా: పోసాని


సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ తన దగ్గరకు వచ్చి... 'నాయనా పోసానీ! నువ్వు బీజేపీకి ప్రచారం చేస్తే నిన్ను రాజ్యసభకు పంపిస్తాను' అని చెప్పినా తాను జగన్ కే ప్రచారం చేస్తానని ప్రముఖ సినీ నటుడు పోసాని  కృష్ణమురళి తెలిపారు. ఒక టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, గతంలో ప్రజారాజ్యం తరపున పోటీ చేయాలని చిరంజీవి అడిగినట్టు రేపు పవన్ కల్యాణ్ కూడా అడిగితే ఏం చేస్తారన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, కావాలంటే తన మాటలు రికార్డు చేసి పెట్టుకోవాలని సూచిస్తూ, తనను ఎవరు అడిగినా, ఎలాంటి పదవితో ప్రలోభపెట్టినా, ఏం చేసినా తాను జగన్ కే ఓటేస్తానని, జగన్ కే ప్రచారం చేస్తానని చెప్పారు. ఒక నిర్ణయం తీసుకున్న తరువాత తిరుగు ఉండదని, తన వ్యక్తిత్వమే అంత అని పోసాని తెలిపారు. పదవి ఇస్తానని జగన్ ఆఫర్ చేసినా తనకు అక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు. జగన్ పోటీ చేయమన్నా చేయనని పోసాని తెలిపారు. 

  • Loading...

More Telugu News