: నేను జగన్ కు ఓటేస్తా... చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు ఓటేయను: పోసాని కృష్ణమురళి


వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఓటేస్తానని ప్రముఖ సినీ నటుడు పోసాని  కృష్ణమురళి ప్రకటించారు. ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ, తాను వచ్చే ఎన్నికల్లో టీడీపీకి కానీ, జనసేనకు కానీ ఓటేయనని చెప్పారు. చంద్రబాబునాయుడు సమర్థుడైన నాయకుడని, అందుకే గత ఎన్నికల్లో ఆయకే ఓటేస్తున్నానని చెప్పానని, చెప్పినట్టే ఆయనకు ఓటేశానని ఆయన తెలిపారు. అయితే, అప్పట్లో చంద్రబాబునాయుడులో కనిపించిన సమర్థత ఇప్పుడు లేదని ఆయన స్పష్టం చేశారు.

ఒకప్పుడు ఆయన చాలా డైనమిక్ గా పని చేసేవారని ఆయన చెప్పారు. ఆయన ముందుకు ఎలాంటి సమస్య వెళ్లినా వెంటనే దాని అంతు చూసేవారని అన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో కుల, మతాల ప్రాబల్యం పెరిగిపోయిందని, అందుకే ఎవరినైనా ఏమైనా అంటే వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతుందేమోనని ఆయన మౌనంగా ఉంటున్నారని ఆయన చెప్పారు. అందుకే ఆయనకు ఓటేయడం లేదని చెప్పారు. ప్రస్తుతానికి తన ఓటు జగన్ కేనని ఆయన చెప్పారు. అయితే, జగన్ ను ఇంతవరకు చూడలేదని, రేపు ఆయన పరిపాలన విధానం చూసిన తరువాత ఆయనపై ఓ నిర్ణయానికి వస్తానని పోసాని అన్నారు.  

  • Loading...

More Telugu News