: సినిమాలు, రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు: నారా బ్రాహ్మణి


సినిమాలు లేదా రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన తనకు లేదని హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి స్పష్టం చేశారు. ఫిక్కి సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం తన దృష్టంతా హెరిటేజ్ అభివృద్ధిపైనే ఉందని అన్నారు. పాల ఉత్పత్తిలో హెరిటేజ్ ను దేశంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దడమే తన ముందున్న లక్ష్యమని చెప్పారు. హెరిటేజ్ ద్వారా 10 లక్షల మంది రైతులకు సేవ చేస్తున్నామని చెప్పిన ఆమె, ఇంతకంటే ఇంకేం కావాలని వ్యాఖ్యానించారు. తన కుటుంబ సభ్యుల సహకారం వల్లే ఈ ఘనత సాధించగలిగానని ఆమె చెప్పారు. వచ్చే ఐదేళ్లలో హెరిటేజ్ వ్యాపారాన్ని 6 వేల కోట్ల టర్నోవర్ కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నానని ఆమె తెలిపారు. రిలయన్స్ డెయిరీ కొనుగోలు చేయడం పూర్తయిందని ఆమె చెప్పారు. మరిన్ని కంపెనీల కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు. 

  • Loading...

More Telugu News