: ఏపీ అక్రమంగా ప్రాజక్టులు కడుతోంది... కేంద్రానికి ఫిర్యాదు చేసిన తెలంగాణ ప్రభుత్వం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. గోదావరి, కృష్ణా నదులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆరోపించింది. ఈ రెండు నదులపై ఏపీ గవర్నమెంట్ 5 ప్రాజెక్టులను అక్రమంగా నిర్మిస్తోందని ఫిర్యాదులో పేర్కొంది. గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించేందుకే పోలవరం, పట్టిసీమ, పురుషోత్తమపట్నం, ముచ్చుమర్రి, గుండ్రేవుల, గాజులదిన్నె, గురురాఘవేంద్ర, పులికనుమ లిఫ్ట్ ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆరోపించింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధమని ఫిర్యాదులో తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.