: శ్రీనివాసరావుతో పాటు ఇద్దరిని విచారించాం... సోమవారం తనీష్ ను విచారిస్తాం: సిట్
ప్రముఖ నటుడు తనీష్ ను సోమవారం విచారిస్తామని సిట్ అధికారులు తెలిపారు. హైదరాబాదులో కలకలం రేపిన డ్రగ్స్ పై సిట్ దర్యాప్తు, విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, ఛార్మీ, ముమైత్ ఖాన్, రవితేజలను విచారించిన సంగతి తెలిసిందే. నేటి ఉదయం 10:30 గంటల నుంచి 1:30 నిమిషాల వరకు డ్రైవర్ శ్రీనివాసరావును విచారించామని తెలిపారు.
అతనితో పాటు రోహిత్ అగర్వాల్, డి.రాజధాన్ లను విచారించామని సిట్ వెల్లడించింది. సోమవారం సిట్ విచారణ ముందు సినీ నటుడు తనీష్ హాజరవుతారని అధికారులు తెలిపారు.