: క్రికెట్ బొగ్గు గని కాదు, వేలం వేయడానికి!: సుబ్రహ్మణ్య స్వామి కేసులో బీసీసీఐ స్పందన
ఐపీఎల్ టోర్నీలో పారదర్శకత కోసం దాని మీడియా హక్కులను ఈ-వేలం వేయాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంలో వేసిన పిటిషన్‌కు సమాధానం కోరుతూ సుప్రీం కోర్టు పంపించిన నోటీసుకు బీసీసీఐ ఒక్కరోజులోనే సమాధానాన్ని సిద్ధం చేసింది. ఈ-వేలం వేయడం ద్వారా బీసీసీఐ ఆర్థికంగా దెబ్బతింటుందని, అయినా వేలం వేయడానికి క్రికెట్, బొగ్గు గని కాదని బీసీసీఐ ప్రతినిధులు అభిప్రాయానికి వచ్చారు. వేలంలో పారదర్శకత కోసమే చూస్తున్నట్లైతే ఐపీఎల్ మీడియా హక్కుల కేటాయింపు గురించి అధ్యయనం చేస్తున్న అంతర్జాతీయ సంస్థ డెలాయిట్, ప్రైవేట్ లా కంపెనీ అమర్‌చంద్ మంగళ్‌దాస్‌లను సంప్రదించాలని బీసీసీఐ ప్రతినిధి అంటున్నారు.
అన్ని జాగ్రత్తలు, రక్షణలు తీసుకున్నాకే సంబంధిత మీడియా వారికి హక్కులను జారీ చేస్తామని, అందులో ఎలాంటి అక్రమాలకు తావులేదని బీసీసీఐ ప్రతినిధి వివరించారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఆగస్టు 22న జరగనుంది.