: జైట్లీని బూతులు తిట్టమని కేజ్రీవాల్ చెప్పారు: రామ్ జెఠ్మలానీ


కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని అభ్యంతరకర పదజాలంతో దూషించాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తనకు చెప్పారని ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ తెలిపారు. జైట్లీని బూతులు తిట్టాల్సిందిగా కోరారని చెప్పారు. కేజ్రీవాల్ పై అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం దావా కేసును జెఠ్మలానీ వాదించిన సంగతి తెలిసిందే. జూలై 20వ తేదీని కేజ్రీవాల్ కు రాసిన లేఖలో ఈ విషయాన్ని జెఠ్మలానీ పేర్కొన్నారు.

తాజాగా అరుణ్ జైట్లీకి కూడా ఈయన లేఖ రాశారు. మే 17న జరిగిన విచారణలో భాగంగా జెఠ్మలానీ తనపై అభ్యంతరకర వ్యాఖ్య చేయడాన్ని అరుణ్ జైట్లీ అప్పుడే తప్పుబట్టారు. ఆ నేపథ్యంలో, రూ. 10 కోట్లకు కేజ్రీపై మరో పరువునష్టం దావా వేశారు. వాస్తవానికి తమ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణల్లో కేజ్రీవాల్ మరింత అభ్యంతరకర భాషను వాడారని జెఠ్మలానీ వెల్లడించారు. జెఠ్మలానీ చేసిన వ్యాఖ్యలు కేజ్రీని మరింత చిక్కుల్లో పడేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

  • Loading...

More Telugu News