: నన్ను షూట్ చేశారు... షిపాలి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లింది: విక్రమ్ గౌడ్ వాంగ్మూలం
నిన్న తెల్లవారుజామున తుపాకీ కాల్పుల గాయాలతో ఆసుపత్రిలో చేరిన విక్రమ్ గౌడ్ నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. తీవ్రగాయాలతో చికిత్స పొందిన ఆయనను పోలీసులు ఘటనపై వివరాలు అడిగారు. తాను కారిడార్ లోకి వచ్చిన సమయంలో గుర్తుతెలియని ఆగంతుకుడు తనపై కాల్పులు జరిపాడని చెప్పినట్టు సమాచారం. తుపాకీ గుళ్లకు గాయపడిన తాను అరవడంతో తన భార్య షిపాలి 108కు ఫోన్ చేశారని, అయితే అది ఆలస్యమవుతుందని భావించి తనను కారులో షిపాలి ఆసుపత్రికి తీసుకొచ్చిందని విక్రమ్ గౌడ్ చెప్పారు. ఆ సమయంలో తన భార్యకు డ్రైవర్లు, వాచ్ మన్, పని మనిషి నలుగురు సాయం చేశారని ఆయన చెప్పారు. కాగా, ఆయన చెప్పిన కథనంపై దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది.