: అస్సాం, గుజరాత్ వరద బాధితులకు సాయం చేయండి: అభిమానులకు ఆమిర్ వీడియో సందేశం
తన అభిమానులతో మంచి పనులు చేయించడం ఎలాగో మిస్టర్ పెర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్‌కు బాగా తెలుసు. గతంలో `సత్యమేవ జయతే` కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సాయం లభించేలా చేసిన ఆమిర్, ఇప్పుడు వీడియో మెసేజ్ ద్వారా అస్సాం, గుజరాత్ వరద బాధితులకు సాయం అందించడానికి నడుం బిగించాడు.
`అస్సాం, గుజరాత్‌లో భారీ వరదలు సంభవించాయి. ఆ రెండు రాష్ట్రాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది నిస్సహాయంగా ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలను మనం అడ్డుకోలేక పోవచ్చు, కానీ వరద బాధితులను ఆదుకునే అవకాశం మనకుంది. అందుకే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి వీలైనంత సహాయం చేసి మన అన్నాచెల్లెళ్లను రక్షించుకుందాం. నేను కూడా నా వంతు సాయం చేస్తాను. మీరు కూడా చేయండి` అంటూ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఆమిర్ ఖాన్ వీడియో పోస్ట్ చేశాడు.