: ప్రియాంకతో ఇంగ్లిష్ టీవీ సిరీస్ నిర్మిస్తున్న మాధురీ దీక్షిత్!
త్వరలో హాలీవుడ్‌లో ఓ కామెడీ టీవీ సిరీస్ కోసం ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్‌లు కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ టీవీ సిరీస్ మాధురీ దీక్షిత్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే హాలీవుడ్‌లో `క్వాంటికో` సిరీస్ ద్వారా యాక్షన్ యాంగిల్ చూపించిన ప్రియాంక, ఈ టీవీ సిరీస్ ద్వారా తనలోని కామెడీ కోణం చూపించనుంది. ఈ టీవీ సిరీస్‌కు మాధురీ దీక్షిత్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ సిరీస్ కోసం బాలీవుడ్ స్క్రీన్‌రైటర్ శ్రీ రావ్‌ను కథకుడిగా ఎంచుకున్నారు. ఈ విషయాన్ని శ్రీ రావ్ తన ట్విట్టర్‌లో స్పష్టం చేశాడు. `ఇద్దరు గొప్ప నటులతో నా తదుపరి ప్రాజెక్టు చేయబోతున్నాను` అంటూ మాధురీ, ప్రియాంకలతో దిగిన ఫొటోను శ్రీ రావ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.