: ఏపీ, తెలంగాణ మధ్య సరికొత్త వివాదం!


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సరికొత్త వివాదం తలెత్తింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో పాలేరు వాగుపై రూ. 25 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఎత్తిపోతల వల్ల తెలంగాణలోని కోదాడ మండలంలో గల పలు గ్రామాలకు తాగునీటి కొరత ఏర్పడుతుందంటూ టీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. కోదాడ టీఆర్ఎస్ ఇన్ ఛార్జ్ శశిధర్ రెడ్డితోపాటు పలువురు నేతలు ఎత్తిపోతల పథకం వద్దకు వెళ్లి తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఎత్తిపోతల పథకం పనులను చేపడితే జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని వారు హెచ్చరించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ఈ నేపథ్యంలో, ఇరు రాష్ట్రాల మధ్య మరో వివాదం ప్రారంభమైనట్టైంది. 

  • Loading...

More Telugu News