: భార్యాభర్తల సంబంధంపై సెహ్వాగ్ ట్వీట్
క్రికెటర్ గా ఎంతో మజాను అభిమానులకు పంచిన వీరేంద్ర సెహ్వాగ్... రిటైర్ అయిన తర్వాత కూడా సోషల్ మీడియా ద్వారా అందరితో టచ్ లో ఉన్నాడు. సెహ్వాగ్ చేసే ట్వీట్లు అందరికీ ఎంతో వినోదాన్ని పంచుతున్నాయి. తాజాగా భార్యాభర్తల సంబంధంపై ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 'కుటుంబానికి భర్త తలలాంటి వాడైతే... ఆ తలను కూడా తిప్పగలిగే మెడ భార్య' అని ట్వీట్ చేశాడు. భార్యలను ప్రేమించే వారు... ఆమెతో సెల్ఫీ తీసుకోవడానికి ఎందుకు నిరాకరిస్తారు? అంటూ పోస్ట్ చేశాడు. అంతేకాదు, తన భార్యతో కలసి దిగిన సెల్ఫీని అప్ లోడ్ చేశాడు. ఈ ట్వీట్ కు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఇప్పటికే దాదాపు 2 వేల మంది రీట్వీట్ చేయగా, 23 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.