: దీక్ష విరమంచిన బుల్లితెర కళాకారులు
అనువాద సీరియళ్ళ ప్రసారం సగానికి సగం తగ్గించేస్తామని మా టీవీ యాజమాన్యం హామీ ఇవ్వడంతో తెలుగు బుల్లితెర కళాకారులు దీక్ష విరమించారు. తెలుగు చానళ్ళలో డబ్బింగ్ సీరియళ్ళు ప్రసారం చేయొద్దంటూ టీవీ ఆర్టిస్టులు కొద్దిరోజులుగా ఇందిరా పార్క్ వద్ద రిలే నిరాహారదీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే.