: మాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం... పోలీసులే అన్నీ చెబుతారు!: విక్రమ్‌గౌడ్ భార్య షిఫాలి
తమ ఇంట్లో జరిగిన కాల్పుల ఘటన మొత్తం ఒక డ్రామా అని వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, అన్ని విషయాలు పోలీసులే తేలుస్తారని విక్రమ్ గౌడ్ భార్య షిఫాలి తెలియజేశారు. `విక్రమ్‌పై దాడి చేసింది ఎవరో తెలియదు. ఆరోజు జరిగిన అన్ని విషయాలు పోలీసులకు చెప్పాను. ఇక వాళ్లే చూసుకుంటారు. పోలీసులపై మాకు నమ్మకం ఉంది. ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్యం నిలకడగానే ఉంది` అని షిఫాలి వివరించారు.
ఇదిలా ఉండగా వేరే ఎవరో వచ్చి దాడి చేసినట్టుగా రుజువు చేసే రక్తమరకలు గానీ, సీసీ కెమెరా సాక్ష్యాలు గానీ కనిపించలేదని, అక్కడ ఉన్న పరిస్థితులన్నీ విక్రమ్ తనను తాను కాల్చుకున్నట్లుగానే సూచిస్తున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. విక్రమ్ స్పృహలోనే ఉన్నప్పటికీ ఇప్పటివరకు నోరు మెదపలేదని తెలుస్తోంది.