: ఐన్‌స్టీన్ నాలుక బయటపెట్టి ఉన్న ఫొటోకు రూ. 80 లక్షలు
ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్, తన నాలుక బయటపెట్టి వెక్కిరిస్తున్నట్లుగా ఉండే ఫొటో అమెరికాకు చెందిన నేట్ సాండర్స్ కంపెనీ నిర్వహించిన వేలంలో రూ. 80 లక్షలు పలికింది. ఈ ఫొటోను 1951, మార్చి 14న తన 72వ పుట్టినరోజు సందర్భంగా తీశారు. దీనిపై ఐన్‌స్టీన్ స్వయంగా సంతకం కూడా చేశారు. అప్పట్లో ఈ ఫొటోను ఐన్‌స్టీన్ తన స్నేహితులకు పంచడం కోసం తొమ్మిది కాపీలు తీయించి పెట్టుకున్నారట. వాటిలో ఒక కాపీని ఈ వేలంలో ఉంచారు. నిజానికి ఇది ఒక గ్రూప్ ఫొటో, ఇందులో ఐన్‌స్టీన్ హావభావాలు బాగుండటంతో ఆయన వరకే కత్తిరించి మరునాడు పేపర్లో ప్రచురించారట.