: సాహోరే బాహుబలి... పాట సరికొత్త రికార్డు!


బాక్సాఫీసు కలెక్షన్ల దగ్గర నుంచి ఎన్నో అంశాల్లో ఎన్నో రికార్డులకు బాహుబలి చిత్రం చిరునామాగా మారిన విషయం ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు. మరి ఇదే చిత్రంలో సాహోరే బాహుబలి... అంటూ సాగే పాట తాజాగా పాత రికార్డును తిరగరాసి కొత్త రికార్డు నెలకొల్పింది. యూట్యూబ్ లో ఈ వీడియో సాంగ్ ను ఇప్పటి వరకు ఐదు కోట్ల మంది వీక్షించారు. దక్షిణాదిన ఓ పూర్తి వీడియో సాంగ్ ను ఇంత మంది వీక్షించడం రికార్డుగా పేర్కొంటూ లహరి మ్యూజిక్ కంపెనీ తన ట్విట్టర్ ఖాతాలో ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ చిత్ర వీడియో సాంగ్స్ రైట్స్ ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఉన్నాయి.

  • Loading...

More Telugu News