: 'బిగ్ బాస్' సూపర్ సక్సెస్ ను ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్


తెలుగు టీవీ ఛానళ్లలో 'బిగ్ బాస్' షో అత్యధిక టీఆర్పీని సాధించి, సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. రోజులు గడిచే కొద్దీ, ఈ కార్యక్రమానికి ఆదరణ మరింత పెరుగుతోంది. వీకెండ్స్ లో తారక్ ఈ కార్యక్రమంలో కనిపిస్తున్నాడు. దీంతో శని, ఆదివారాల్లో ఈ షో టీఆర్పీ అమాంతం పెరిగిపోతోంది. షో సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో, 'బిగ్ బాస్' సక్సెస్ ను తారక్ తన యూనిట్ సభ్యులతో కలసి సెలబ్రేట్ చేసుకున్నాడు. కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నాడు.

  • Loading...

More Telugu News