: మాల్‌వేర్ దాడి... పాస్‌వర్డ్‌లు మార్చుకోండి: వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ సూచన
బ్రాడ్‌బ్యాండ్ మోడెంలలో డిఫాల్ట్ పాస్‌వర్డ్ `అడ్మిన్` అని ఉండటం వల్ల 2 వేలకి పైగా మోడెంలు మాల్‌వేర్ దాడికి గురయ్యాయని, వీలైనంత త్వరగా వినియోగదారులు తమ పాస్‌వర్డ్‌లు వెంటనే మార్చుకోవాలని బీఎస్ఎన్ఎల్ సంస్థ కోరింది. చాలా మోడెంలకు పాస్‌వర్డ్‌లను మార్చకుండా అలాగే ఉంచడం అనే బలహీనతను ఆసరాగా చేసుకుని మోడెంపై దాడి చేసేలాగ మాల్‌వేర్‌ను రూపొందించారని, ఒక్కసారి పాస్‌వర్డ్ మార్చుకుంటే ఎలాంటి అపాయం ఉండదని బీఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది. పాస్‌వర్డ్‌లు సులభంగా గుర్తించడానికి వీలు లేకుండా పెట్టుకోవాలని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ తెలియజేశారు.