: కేసీఆర్ పై ప్రశంసలు కురిపించిన రామ్ గోపాల్ వర్మ!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసల జల్లు కురిపించారు. కేసీఆర్ ఓ అద్భుతమైన నాయకుడంటూ కితాబిచ్చారు. డ్రగ్స్ తీసుకుంటున్న వారంతా దోషులు కాదని, కేవలం బాధితులు మాత్రమే అని కేసీఆర్ చెప్పడాన్ని వర్మ స్వాగతించారు. సమస్యను ముఖ్యమంత్రి సరిగా అర్థం చేసుకున్నారని కొనియాడారు. విచారణ సిబ్బందికి కూడా కేసీఆర్ విజన్ అవసరమని తాను భావిస్తున్నట్టు చెప్పాడు. అప్పుడే సమస్యకు సరైన పరిష్కారం లభిస్తుందని సూచించాడు. మరోవైపు, ఈ రోజు హీరో రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ ను సిట్ అధికారులు విచారించనున్నారు.