: సినీ ప్రముఖులకు డ్రగ్స్ చేరవేసేది రవితేజ డ్రైవరే.. అనుమానిస్తున్న సిట్.. కాసేపట్లో విచారణ ప్రారంభం


సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరాలో టాలీవుడ్ నటుడు రవితేజ కారు డ్రైవర్ శ్రీనివాసరావు హస్తం ఉందని భావిస్తున్న అధికారులు అతడిని విచారించేందుకు రంగం సిద్దం చేశారు. మరికొద్ది సేపట్లో ఆయనను విచారించనున్నారు. శుక్రవారం రవితేజ విచారణ సందర్భంగా ఆయన వెంట శ్రీనివాసరావు సిట్ కార్యాలయానికి వచ్చాడు. కెల్విన్ నుంచి సినీ ప్రముఖులకు శ్రీనివాసరావే డ్రగ్స్ సరఫరా చేసేవాడని సిట్ అధికారులు బలంగా నమ్ముతున్నారు.

 దీంతో అతడిని ప్రశ్నించడం ద్వారా వివరాలు సేకరించాలని నిర్ణయించారు. కాగా, నిన్న జరిగిన విచారణలో రవితేజ తనకు, డ్రగ్స్‌కు ఎటువంటి సంబంధం లేదని, తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని పేర్కొన్నాడు. తాను బ్యాంకాక్ వెళ్లేది మంచి ఆలోచనల కోసమే తప్ప డ్రగ్స్ తీసుకునేందుకు కాదని స్పష్టం చేశాడు. అయితే చిన్నచిన్న పార్టీలు సహజమేనని అధికారులతో పేర్కొన్నట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News