: అవును.. నా తమ్ముడు గంజాయి తాగుతాడు!: రవితేజ
డ్రగ్స్ కేసులో భాగంగా శుక్రవారం సిట్ విచారణకు హాజరైన సినీ నటుడు భూపతిరాజు రవి శంకర్ రాజు అలియాస్ రవితేజ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని పేర్కొన్నాడు. తన సోదరుడు భరత్‌కు డ్రగ్స్ అలవాటుపై అధికారులు వేసిన ప్రశ్నకు స్పందిస్తూ.. భరత్‌కు గంజాయి తాగే అలవాటు ఉండొచ్చేమో కానీ కొకైన్ వంటి మత్తు పదార్థాల జోలికి ఎప్పుడూ పోలేదని పేర్కొన్నాడు.
దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి చార్మి, ముమైత్‌ఖాన్‌లకు డ్రగ్స్ అలవాటుందా? అన్న ప్రశ్నకు లేదని ముక్తసరిగా జవాబు చెప్పాడు. విచారణ అనంతరం పరీక్షల కోసం గోళ్లు, జుట్టు, రక్త నమూనాలు తీసుకోవచ్చా? అని అడగ్గా ఇచ్చేందుకు రవితేజ నిరాకరించాడు. కాగా, విచారణలో భాగంగా రవితేజను మొత్తం 100 ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. నేడు (శనివారం) రవితేజ కారు డ్రైవర్ శ్రీనివాసరాజును సిట్ బృందం విచారించనుంది.