: నేను బ్యాంకాక్ వెళ్లేది డ్రగ్స్ కోసం కాదు.. సిట్‌కు స్పష్టం చేసిన రవితేజ


తాను డ్రగ్స్ కోసమే బ్యాంకాక్ వెళ్తున్నట్టు వస్తున్న వార్తలు సరికావని టాలీవుడ్ నటుడు రవితేజ తనను విచారించిన సిట్ అధికారుల ఎదుట స్పష్టం చేశాడు. ఆ ప్రచారంలో నిజం లేదని, క్రియేటివిటీ, చక్కని ఆలోచనల కోసమే బ్యాంకాక్, గోవా లాంటి ప్రాంతాలకు వెళ్తుంటామని పేర్కొన్నాడు. శుక్రవారం ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు సాగిన సిట్ విచారణలో రవితేజ పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది.

తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు కానీ, ఇతర చెడు అలవాట్లు కానీ లేవని తేల్చి చెప్పాడు. డ్రగ్స్ కేసులో నిందితులైన జీషన్, కెల్విన్‌‌ల ఫోన్ కాల్ డేటాలో మీ ఫోన్ నంబరు ఎందుకు ఉందన్న ప్రశ్నకు.. వారెవరో తనకు తెలియదని, వారి కాల్ లిస్ట్‌లో తన నంబరు ఉండడం తప్పెలా అవుతుందని అధికారులను తిరిగి ప్రశ్నించాడు. సినిమాలను మరింత బాగా తీయడానికి వివిధ రకాల లొకేషన్స్‌కు వెళ్తుంటామని, కొన్ని ప్రదేశాల్లో అద్భుతమైన ఆలోచనలు వస్తుంటాయని, అందుకోసమే ఆయా ప్రాంతాలకు వెళ్తామని స్పష్టం చేశాడు. షూటింగ్ సమయంలో యూనిట్ సభ్యులందరూ కలిసి చిన్నచిన్న పార్టీలు చేసుకోవడం పరిపాటేనని తేల్చి చెప్పాడు.  

  • Loading...

More Telugu News