: పాక్ తదుపరి ప్రధాని షహబాజ్ షరీఫ్!


పాకిస్థాన్ కు తదుపరి ప్రధాని షహబాజ్ షరీఫ్ అవుతారని పాక్ మీడియా పేర్కొంటోంది. ప్రధాని పదవికి నవాజ్ షరీఫ్ అనర్హుడని సుప్రీంకోర్టు ప్రకటించిన నేపథ్యంలో నవాజ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్ కొత్త ప్రధానిని నిర్ణయించింది. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ఉన్న షహబాజ్ ను నవాజ్ ప్రతిపాదించడంతో పార్టీ అంగీకరించినట్టు తెలుస్తోంది. దీంతో పాకిస్థాన్ లో మరో పార్టీ వారసత్వ రాజకీయాల వైపు మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే భుట్టో కుటుంబం వారసత్వ రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో మరో పార్టీ వారసత్వ రాజకీయాలకే మొగ్గుచూపినట్టు అర్థమవుతోందని పాక్ మీడియా పేర్కొంది.

  • Loading...

More Telugu News