: మిథాలీ రాజ్ కు కోటి రూపాయల నజరానా, ఇంటి స్థలం ప్రకటించిన కేసీఆర్
ఐసీసీ మహిళా క్రికెట్ వరల్డ్ కప్ లో రన్నరప్ గా నిలిచిన భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నజరానా ప్రకటించారు. కేసీఆర్ ను మిథాలీ కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణకు మిథాలీ గర్వకారణమని అన్నారు. దురదృష్టవశాత్తు ఫైనల్ లో భారత మహిళా జట్టు ఓటమిపాలైందని ఆయన అన్నారు. కానీ టోర్నీ ఆద్యంతం మిథాలి నేతృత్వంలోని భారత మహిళా జట్టు అద్భుతమైన ఆటతీరుతో భారతీయుల మనసులు గెలుచుకుందని ఆయన కితాబునిచ్చారు.
జట్టును అత్యుత్తమ ప్రమాణాలతో నడిపినందుకుగాను ఆమెకు కోటి రూపాయల నజరానా ప్రకటిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే బంజారా హిల్స్ లో ఆమె నివాసం కోసం 600 గజాల స్థలం కేటాయిస్తామని తెలిపారు. అలాగే మిథాలీ వ్యక్తిగత కోచ్ మూర్తికి 25 లక్షల రూపాయల నజరానా ఇవ్వనున్నామని తెలిపారు. దీనిపట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.