: డ్రగ్స్ వాడేవారు బాధితులే... అమ్మకందారులు, సరఫరాదారులే నేరస్తులు!: కేసీఆర్ స్పష్టీకరణ


డ్రగ్స్ వాడేవారు ఎవరైనా వారంతా బాధితులేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలుగు సినీ పరిశ్రమను లక్ష్యం చేసుకున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన చెప్పారు. డ్రగ్స్ తీసుకోవడం నేరం కాదని ఆయన తెలిపారు. డ్రగ్స్ వ్యాపారులు, సరఫరాదారుల ఆనవాళ్లు తెలుసుకునేందుకు, డ్రగ్స్ చొరబడుతున్న విధానం, అమ్మకం జరుగుతున్న ప్రదేశాలు వంటి వివరాలు తెలుసుకునేందుకే విచారణ జరుగుతున్నట్టు ఆయన తెలిపారు.

డ్రగ్స్ ను అరికట్టాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. డ్రగ్స్ వ్యాపారం లేదా సరఫరా చేసినవారిపైనే నేరారోపణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అమ్మకందారులు, సరఫరాదారుల్లో సినీ ప్రముఖులు ఉంటే వారిపై కేసులు పెడతామని ఆయన తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేసేవారు, అమ్మేవారు ఎంతటి వారైనా క్షమించేది లేదని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News