: కేసీఆర్ పై ప్రశంసలు కురిపించిన ఏపీ మంత్రి దేవినేని
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు అందరికీ ఆదర్శప్రాయులని ఏపీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. నిన్న ఢిల్లీలో కేసీఆర్ మాట్లాడుతూ, ఇరు తెలుగు రాష్ట్రాలు కలసిమెలసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని... రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలు కూడా త్వరలోనే సమసిపోతాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే, దేవినేని ఉమా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో ఏపీకి దేవినేని కొత్త నిర్వచనం చెప్పారు. ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం అని అన్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పార్టీలో చేర్చుకున్న వైసీపీ అధినేత జగన్ పై ఆయన మండిపడ్డారు. కల్తీ మద్యంతో ఐదుగురి ప్రాణాలను బలి తీసుకున్నవారిని పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. మల్లాది విష్ణు నిన్న వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.