: ఎండోమెంట్ శాఖకు రూ. 17.44 కోట్లు చెల్లించిన ఎమ్మెల్యే ఆళ్ల
సదావర్తి భూముల వేలం వ్యవహారంలో ఎండోమెంట్ శాఖకు వైపీసీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ రోజు రూ. 17.44 కోట్లను చెల్లించారు. హైకోర్టు సూచనల ప్రకారం ఆయన తొలి విడత రూ. 10 కోట్లను చెల్లించారు. ఇప్పుడు మిగిలిన మొత్తాన్ని దేవాదాయశాఖ ఖాతాకు జమ చేశారు. సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల భూమిని రూ. 22 కోట్లకు ఏపీ ప్రభుత్వం వేలం వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆళ్ల కోర్టుకు వెళ్లారు. రూ. 27.44 కోట్లు చెల్లించి భూమిని సొంతం చేసుకోవడానికి ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నారని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో, ఆ మొత్తాన్ని చెల్లించి భూమిని సొంతం చేసుకోమని ఆళ్లకు కోర్టు సూచించింది. దీంతో, ఆయన మొత్తం రూ. 27.44 కోట్లను చెల్లించారు.