gopichand: గోపీచంద్ రెండు పాత్రలకు ప్రశంసలు!

సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ చేసిన 'గౌతమ్ నంద' సినిమా భారీస్థాయిలో ఈ రోజునే విడుదలైంది. ఈ సినిమాలో గోపీచంద్ 'గౌతమ్' గా .. 'నందు'గా రెండు విభిన్నమైన పాత్రలను పోషించాడు. గౌతమ్ కోటీశ్వరుడైతే .. నందు పేదవాడు. ఈ రెండు పాత్రల మధ్య చాలా వైవిధ్యం వుంది. అలాంటి ఈ పాత్రలలో గోపీచంద్ చాలా బాగా చేశాడని అంటున్నారు.

 రెండు పాత్రల్లోను లుక్ పరంగానే కాకుండా .. నటన పరంగా కూడా గోపీచంద్ మంచి మార్కులు కొట్టేశాడని చెబుతున్నారు. పాత్రల పరంగా గోపీచంద్ తో కొత్త ప్రయోగాలు చేయవచ్చనే సంగతిని ఈ సినిమా నిరూపించిందని అంటున్నారు. మాస్ ఆడియన్స్ ను మెప్పించడంలో ఆయన మరోమారు సక్సెస్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. గోపీచంద్ ఆశిస్తున్నట్టుగా ఈ సినిమా హిట్ చిత్రాల జాబితాలో చేరుతుందో లేదో చూడాలి.

More Telugu News