: సమాధానం చెప్పడం మానేసి అబద్ధాలు చెబుతున్న కేటీఆర్ ను ఎలా శిక్షించాలి?: షబ్బీర్ అలీ
కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం మానేసిన మంత్రి కేటీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత నేత షబ్బీర్ అలీ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఆవిర్భావానికి ముందే ఆటోమొబైల్ వ్యాపారం నుంచి బయటకు వచ్చేశానని చెబుతున్న కేటీఆర్, 2014 ఎన్నికల అఫిడవిట్ లో హిమాంశు మోటార్స్ లో 30 లక్షల రూపాయల విలువైన షేర్లు ఉన్నాయని ఎలా ప్రకటించారని ప్రశ్నించారు. హిమాంశు మోటార్స్ కేటీఆర్ దేనని ఆయన స్పష్టం చేశారు.
300 ఇన్నోవాల కొనుగోలులో జరిగిన అక్రమాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే స్వర్ణభారతి ట్రస్టుకు ఎన్ని రాయితీలు ఇస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వాస్తవాలు మరుగుపరిచి, అబద్ధాలు ప్రచారం చేస్తున్న కేటీఆర్ కు ఏ శిక్ష విధించాలని ఆయన ప్రశ్నించారు.