: విక్రమ్ గౌడ్ మొబైల్ లో 39 వాట్స్ యాప్ మెసేజ్ లు.. అప్పులపై నిలదీత?


మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాల్పుల కేసు మిస్టరీ వీడుతోంది. నేటి తెల్లవారు జామున 3:10 నిమిషాలకు తుపాకీతో ఆగంతుకుడు కాల్పులు జరిపాడంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలు విషయాలను గుర్తించారు. విక్రమ్ గౌడ్ ఫోన్ లో గత పదిరోజులుగా డ్రగ్స్ దందాపై సిట్ చేస్తున్న విచారణ వివరాలను నిక్షిప్తం చేసుకున్నాడు.

అలాగే గత 15 రోజుల్లో విక్రమ్ గౌడ్ కు 39 వాట్స్ యాప్ మెసేజ్ లు వచ్చాయి. ఈ మెసేజులన్నింటిలో 'ఫలానా అప్పుడు 20 లక్షలిచ్చాను తిరిగి ఇవ్వు' అని, 'నీకు 30 లక్షలిచ్చాను కదా, అవిప్పుడే కావాలి' అని, 'నీకిచ్చిన 35 లక్షలు ఇప్పుడిచ్చెయ్ చాలా అవసరం' అంటూ భారీ ఎత్తున డబ్బులకు సంబంధించిన డిమాండ్లు ఉన్నాయి. అప్పుల వాళ్ల ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంతో పాటు మాదాపూర్ లో పబ్ కలిగి ఉన్న విక్రమ్ గౌడ్ కు డ్రగ్స్ తలనొప్పులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిట్ విచారణ, అప్పుల బాధ తొలగించుకోవాలంటే తన ముందు ఉన్న ఏకైక మార్గం ఆత్మహత్యాయత్నం అని ఆయన భావించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News