: రాత్రి 7 తర్వాత కేటీఆర్ ఎక్కడకు వెళ్తున్నారు?.. కేసీఆర్ మనవడు చదివే స్కూల్లోనే డ్రగ్స్ అమ్ముతున్నారు: రేవంత్ రెడ్డి


టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరం డ్రగ్స్ హబ్ గా మారిందని ఆయన ఆరోపించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు చదువుతున్న స్కూల్లోనే డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయంటూ విమర్శించారు. తన కుమారుడు కేటీఆర్ రాత్రి 7 గంటల తర్వాత ఎక్కడకు వెళ్తున్నారో కేసీఆర్ కు తెలుసా? అని ప్రశ్నించారు. కేటీఆర్ బలహీనతలను తెలుసుకుని వెనకుండి ఆడిస్తున్న రాజులెవరని ప్రశ్నించారు. ఇలాంటి వ్యవహారాలను కేసీఆర్ ప్రోత్సహిస్తారని తాను భావించడం లేదని... అయితే, కనీస నిఘా వ్యవస్థ ఏమైందని అన్నారు.

డ్రగ్స్ వ్యవహారంలో పాలకులు, వారి కుటుంబాలకు కూడా సంబంధం ఉందని రేవంత్ ఆరోపించారు. డ్రగ్స్ వాడుతున్నవారిని విచారిస్తున్నారే తప్ప... వాటి మూలాలను వెతికే ప్రయత్నం చేయడం లేదని మండిపడ్డారు. గత 60 ఏళ్ల కాలంలో కేవలం 5-6 పబ్ లకు మాత్రమే అనుమతినిస్తే... మూడేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏకంగా 57 పబ్ లకు అనుమతిని ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ లు డ్రగ్స్ కు అడ్డాలుగా మారాయని అన్నారు. డ్రగ్స్ అమ్మేవారిని ఎన్ కౌంటర్ చేసి చంపాలని... దీనికి తాము కూడా మద్దతు ఇస్తామని చెప్పారు. 

  • Loading...

More Telugu News