: సిట్ విచారణలో హీరో రవితేజ వాదన ఇది!


టాలీవుడ్ డ్రగ్స్ దందాలో హీరో రవితేజను నేడు విచారిస్తున్నసిట్ తొలుత డ్రగ్స్ వాడకంపై తన వాదన వినిపించాలని కోరగా, రవితేజ మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధమూ లేదని చెప్పినట్టు తెలుస్తోంది. తన సొంత తమ్ముడు భరత్‌ డ్రగ్స్ వాడుతున్నాడని తెలుసుకుని, అతన్నే దూరం పెట్టిన తాను డ్రగ్స్ ఎందుకు తీసుకుంటానని సిట్ అధికారులను రవితేజ ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం.

డ్రైవర్ గా ఉన్న శ్రీనివాసరాజుతో ఎప్పటి నుంచి పరిచయం? అతని ద్వారా ఏమైనా డ్రగ్స్ తెప్పించుకున్నారా? వంటి ప్రశ్నలకు రవితేజ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సోదరులతో డ్రగ్స్ సంబంధాలు, కెల్విన్‌ తో నడిపిన వ్యవహారాలు, తదితరాంశాలపైనా రవితేజను ప్రశ్నిస్తున్నారు. రక్త నమూనాలు తీసుకోవచ్చా? అన్న ప్రశ్నకు కూడా రవితేజ మౌనంగానే ఉన్నట్టు సమాచారం. ఇక రవితేజతో పాటు ఆయన వాహనం డ్రైవర్ శ్రీనివాసరాజును సైతం విచారణకు పిలిచిన అధికారులు మరో గదిలో ఆయన్ను విచారిస్తున్నారు. కాసేపట్లో ఇద్దరినీ ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని సిట్ అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News