: తక్షణం రాజీనామా చెయ్యి... నవాజ్ పై క్రిమినల్ కేసులకు సుప్రీంకోర్టు ఆదేశం
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఐదుగురు సభ్యుల పాకిస్థాన్ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. పనామా కేసులో ఆయన దోషేనని, వెంటనే ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, వెంటనే పూర్తి స్థాయి దర్యాఫ్తు ప్రారంభించాలని తీర్పిచ్చింది. ఆయన పదవిలో కొనసాగేందుకు వీలు లేదని, దేశ ప్రజల సంపదన తన సొంతానికి వాడుకున్నారని, విదేశాల్లో ఆస్తులు కూడబెట్టారనడంలో సందేహం లేదని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో తుది తీర్పును నెల రోజుల్లోగా వెల్లడిస్తామని, అంతవరకూ ఆయనకు పదవిలో కొనసాగే వెసులుబాటును కూడా కల్పించలేమని స్పష్టం చేసింది