: బాతును చంపినందుకు ఉరిశిక్ష విధించాలని కోరుతున్న మహిళ!
అస్సాంలోని గుహవాటి ప్రాంతానికి చెందిన రేణు రెబా తమ బాతును, తన ఇంటి పక్కన నివాసముంటున్న కుసుంబార్ బారు చంపేశాడు. తన గుడ్లు పెట్టే బాతును చంపినందుకు కుసుంబార్‌కు ఉరిశిక్ష విధించాలని రేణు పోలీసులను కోరింది. బాతు తన ఇంట్లోకి వచ్చినపుడు కర్రతో కొట్టాను గానీ, దాన్ని చంపలేదని కుసుంబార్ చెబుతున్నాడు. కుసుంబార్ కొట్టడం వల్లే చనిపోయిందని రేణు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్ 429 ప్రకారం కుసుంబార్‌పై కేసు నమోదు చేసి, బాతు చనిపోవడానికి గల కారణాలను తెలుసుకోవడానికి మృతదేహాన్ని ప్రభుత్వ పశు వైద్య కళాశాలకు పోస్ట్‌మార్టం కోసం పంపించినట్లు నూన్‌మతి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జీ రాజిబ్ తెలిపారు. ఈ సెక్షన్ 429 ప్రకారం జంతువును చంపినందుకు ఐదేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు గానీ ఫిర్యాదుదారు కోరినట్లుగా ఉరిశిక్ష విధించడం కుదరదని రాజిబ్ పేర్కొన్నారు.