: విక్రమ్ గౌడ్ ను పరామర్శించిన పూరి జగన్నాథ్!
ఈ తెల్లవారుజామున తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ను సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ పరామర్శించారు. జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి వెళ్లిన పూరి... విక్రమ్ ను పరామర్శించి, అతని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. విక్రమ్ గౌడ్ కు సినీ నిర్మాతగా పరిశ్రమలోని చాలా మందితో పరిచయాలు ఉన్నాయి. హీరో నితిన్ సోదరి నిఖితారెడ్డితో కలసి ఆయన ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలను నిర్మించారు. మరోవైపు, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా విక్రమ్ గౌడ్ ను పరామర్శించారు.