: ప్రధాని నవాజ్ షరీఫ్ పదవిలో కొనసాగేందుకు అనర్హుడు!: పాకిస్థాన్ సుప్రీంకోర్టు
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పై అక్కడి అత్యున్నత న్యాయస్థానం వేటు వేసింది. ఆయన పదవిలో కొనసాగేందుకు అనర్హుడని తేల్చింది. పనామా లీక్స్ కేసులో నవాజ్ ప్రమేయంపై ఆధారాలు ఉన్నాయని అభిప్రాయపడ్డ పాక్ సుప్రీంకోర్టు, ఆయన పదవిలో ఉండేందుకు తగడని తేల్చి చెప్పింది. మనీ లాండరింగ్, విదేశాల్లో ఆస్తులను పెంచుకోవడం తదితర ఆరోపణలు నవాజ్ పై వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసు చాలా లోతుగా ఉందని వ్యాఖ్యానించిన కోర్టు, ఆరు వారాల్లోగా నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. జస్టిస్ ఆసిఫ్ సయీద్ ఖాన్ ఖోసా నేతృత్వంలోని న్యాయమూర్తులు ఇజాజ్ అఫ్జల్ ఖాన్, గుల్జార్ అహ్మద్, గేక్ అజామత్ సయీద్, ఇజాజుల్ అహ్ సెన్ లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.