: విక్రమ్ నోరు విప్పితేనే కేసు తేలుతుంది: సీపీ మహేందర్ రెడ్డి
తనపై కాల్పులు ఎందుకు జరిగాయన్న విషయం, ఎవరు కాల్చారన్న విషయాలు విక్రమ్ గౌడ్ నోరువిప్పితేనే తెలుస్తాయని తెలంగాణ సీపీ మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. విక్రమ్ గౌడ్ వద్ద తుపాకి లైసెన్స్ లేదని స్పష్టం చేసిన ఆయన, విక్రమ్ ఇంట మరెవరి వద్ద కూడా లైసెన్స్డ్ గన్ లేదని తెలిపారు. ఈ కేసులో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి వుందని, ఇంకా విక్రమ్ విచారణకు సహకరించే స్థితిలోకి రాలేదని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎంతో మిస్టరీ కనిపిస్తోందని, దాన్ని ఛేదించాలంటే విక్రమ్ నోరు విప్పాల్సిందేనని అన్నారు. ఆయనే స్వయంగా తనపై దాడి చేసిన వారిని దాచాలని ప్రయత్నించినా అంగీకరించబోమని, అందుకు తగ్గ కారణాలను అన్వేషించి కేసులు పెడతామని తెలిపారు.