: 'బాబాయ్ సూపర్' అని కల్యాణ్ రామ్ అంటుంటే... 'అబ్బాయి' గురించి అడుగుతున్న నెటిజన్లు!


ఈ ఉదయం బాలకృష్ణ హీరోగా నటించిన 'పైసా వసూల్' స్టంపర్ విడుదలై వైరల్ అవుతుండగా, దాన్ని చూసిన నటుడు, నిర్మాత కల్యాణ్ రామ్, తన ట్విట్టర్ ఖాతాలో స్పందించగా, వందలాది మంది అభిమానులు ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'జై లవ కుశ' టీజర్, ట్రయిలర్ ఎప్పుడని ప్రశ్నల వర్షం కురిపించారు.

"బాబాయ్ హై ఓల్టేజ్ అవతారం చూసేందుకు ఎంతో బాగుంది" అని కల్యాణ్ రామ్ వ్యాఖ్యానించగా, "అన్నయ్యా... మా 'లవ' టీజర్ వదలండి త్వరగా" అని ఒకరు, "లవ టీజర్ కావాలి" అని ఇంకొకరు, "ఐయామ్ వెయిటింగ్ ఫర్ జై లవకుశ టీజర్" అని మరొకరు వ్యాఖ్యానించారు. వీటితో పాటు లవ టీజర్ చెప్పు మామా అని, ఈ టీజర్ పై ఎన్టీఆర్ ను అభిప్రాయం చెప్పమని అడగండి అని, లవ టీజర్ వదలండి అన్నయ్యా అని అభిమానుల నుంచి ఎన్టీఆర్ కొత్త చిత్రం టీజర్ కోసం తామెంతగా ఆత్రుతతో ఉన్నామో తెలుపుతూ రిప్లయ్ లు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News