: హైదరాబాద్- వాషింగ్టన్ నేరుగా విమాన సర్వీసు.... ప్రకటించిన మంత్రి అశోక్ గజపతిరాజు
ఇక హైద్రాబాద్, ఢిల్లీ మీదుగా నేరుగా వాషింగ్టన్ చేరుకునే అవకాశాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు కల్పించారు. ఈ మార్గాల్లో ఎయిరిండియా విమాన సర్వీసులను ప్రారంభించినట్లు ఆయన పార్లమెంట్‌లో ప్రకటించారు. అమెరికాకు విమాన సర్వీసుల గురించి ఎంపీ వినోద్ కుమార్ అడిగిన ప్రశ్నకు అశోక్ గజపతిరాజు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. హైద్రాబాద్ - ఢిల్లీ, వాషింగ్టన్ - ఢిల్లీ - హైద్రాబాద్ మార్గాల్లో ప్రతి బుధ, శుక్ర, ఆది వారాల్లో విమాన సర్వీసు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. అలాగే అమెరికాలోని లాస్ ఏంజెలీస్, హ్యూస్టన్ ప్రాంతాలకు కూడా అవసరాన్ని బట్టి విమాన సర్వీసులను కల్పిస్తామని అశోక్ గజపతిరాజు తెలియజేశారు.