: హీరో రవితేజను అడుగుతున్న ప్రశ్నలివే!
దాదాపు గంట క్రితం హీరో రవితేజ సిట్ కార్యాలయానికి చేరుకోగా, సుమారు అరగంట పాటు అతని యోగక్షేమాలు, పరిచయ కార్యక్రమాల అనంతరం, సిట్ అధికారుల విచారణ మొదలైంది. డ్రగ్స్ వ్యవహారంలో రవితేజ పాత్రపై ప్రశ్నించేందుకు సిద్ధమైన అధికారులు, పూరీ, చార్మీ, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, నవదీప్ తదితరుల నుంచి తీసుకున్న వాంగ్మూలాలను రవితేజ ఇచ్చే స్టేట్ మెంట్ తో పోల్చనున్నారు. ఇక విచారణలో భాగంగా, కెల్విన్ జిషాన్ లతో రవితేజ పరిచయాలపైనే తొలి రెండు గంటలూ ఆయన్ను ప్రశ్నించాలని సిట్ భావిస్తున్నట్టు సమాచారం.
కాల్వినే స్వయంగా జిషాన్ ను పరిచయం చేశాడా? వీరి నుంచి మీకు ఎందుకు ఫోన్లు వచ్చాయి? విల్సన్ తో మీరు డ్రగ్స్ కోసమే మాట్లాడేవారా? మీ డ్రైవర్ శ్రీనివాస్ మీకు ఎవరి నుంచి డ్రగ్స్ తెచ్చి ఇచ్చేవాడు? దక్షిణాఫ్రికా నుంచి మీకు డ్రగ్స్ సరఫరా చేసింది ఎవరు? డ్రగ్స్ కొనుగోలుకు ఎంత డబ్బు వెచ్చించేవారు? ఏ రూపంలో దాన్ని చెల్లించేవారు? కాల్విన్ తో కలసి పార్టీలకు ఎందుకు వెళ్లారు? పార్టీలు ఎక్కడ జరిగేవి? పార్టీల్లో డ్రగ్స్ తీసుకునేవారా? డ్రగ్స్ కు ఆర్డర్ ఇచ్చేది ఎవరు? షూటింగులు లేకపోయినా బ్యాంకాక్ కు ఎందుకు వెళతారు? డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? జిషాన్ ఎప్పటి నుంచి పరిచయం? ఆరేళ్ల నుంచే మీరు డ్రగ్స్ వాడుతున్నారా? తదితర ప్రశ్నలను రవితేజ ముందు ఉంచినట్టు సమాచారం.