: తనను అసభ్యంగా తాకారని చార్మి ఫిర్యాదు చేయలేదు: అకున్ సబర్వాల్


రెండు రోజుల క్రితం హీరోయిన్ చార్మీ విచారణ నిమిత్తం నాంపల్లి అబ్కారీ భవనానికి వచ్చిన వేళ, ఓ కానిస్టేబుల్ ఆమెను అసభ్యంగా తాకాడని వచ్చిన వార్తలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. చార్మీ ఇదే విషయాన్ని ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇక వీటిపై ఎక్సైజ్ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సభర్వాల్‌ వివరణ ఇచ్చారు. చార్మీ తమకు ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని ఆయన చెప్పారు. డ్రగ్స్ దందా కేసులో తాము నిత్యమూ ఎంతో మందిని ప్రశ్నిస్తున్నామని, సెలబ్రిటీలు కావడం వల్ల సినిమా వాళ్లే ప్రముఖంగా కనిపిస్తున్నారని అన్నారు. కాగా, చార్మీని తాకాడన్న ఆరోపణలు ఎదుర్కొన్న కానిస్టేబుల్ ను ఎక్సైజ్ శాఖ వద్ద డ్యూటీ నుంచి తప్పించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News