: మెట్లెక్కాలా? అని అడిగిన రవితేజ... లిఫ్ట్ పని చేస్తుందన్న అధికారులు!


గత 9 రోజులుగా సిట్ కార్యాలయానికి విచారణ నిమిత్తం వస్తున్న సినీ ప్రముఖులను చూస్తున్నాడో ఏమో... హీరో రవితేజ ఈ ఉదయం సిట్ కార్యాలయానికి వచ్చిన వేళ, వేగంగా ఎడమవైపు ఉన్న మెట్ల వైపు తిరిగి, ఇటే వెళ్లాలా? అని అక్కడి అధికారిని అడుగగా, సదరు అధికారి లిఫ్ట్ వైపు చూపించి, దానిలో వెళ్లవచ్చని చెప్పడంతో, రవితేజ కుడివైపున ఉన్న లిఫ్ట్ వైపు వెళ్లారు. కాగా, పూరీ జగన్నాథ్, చార్మీ తదితరులు సిట్ విచారణకు వచ్చిన సమయంలో లిఫ్ట్ పని చేస్తుండగా, నవదీప్, తరుణ్, ముమైత్ ఖాన్ లు మెట్లెక్కి ఐదో అంతస్తులో ఉన్న సిట్ ప్రత్యేక కార్యాలయానికి వెళ్లారు. రవితేజ వచ్చిన వేళ మాత్రం లిఫ్ట్ పని చేస్తుండటంతో ఆయన లిఫ్ట్ లో డైరెక్టుగా సిట్ ఆఫీసులోకి వెళ్లిపోయారు. ఆయన వెంట వచ్చిన మరో వ్యక్తిని పోలీసులు బయటే ఆపేశారు.

  • Loading...

More Telugu News