: బయటి నుంచి ఎవరూ రాలేదు... విక్రమ్ పై కాల్పులు ఇంట్లోవారి పనే కావచ్చు: సెక్యూరిటీ గార్డు


ఈ తెల్లవారుజామున విక్రమ్ గౌడ్ ఇంట్లోకి బయటి నుంచి ఎవరూ రాలేదని, తలుపులు వేసే ఉన్నాయని, వాటిని తీసిన శబ్దం కూడా తనకు వినిపించలేదని, ఆ పక్కింట్లోనే రాత్రంతా కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డు షరీఫుద్దీన్ పోలీసు అధికారులకు కీలక సాక్ష్యం ఇచ్చాడు. తమ విచారణలో భాగంగా పోలీసులు ప్రశ్నించగా, ఎవరూ లోపలికి వెళ్లలేదని, కాల్పులు మాత్రం వినపడ్డాయని, ఇంట్లోని వారే ఈ ఘటనకు పాల్పడ్డట్టు తాను భావిస్తున్నానని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ కేసులో నిందితులు ఇంకా బహిర్గతం కాకపోవడం, కేసు ఉన్నత కుటుంబానికి చెందినది కావడంతో విచారణను వేగవంతం చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆసుపత్రిలో ఈ మధ్యాహ్నం విక్రమ్ గౌడ్ ను వీలైతే మరోసారి ప్రశ్నిస్తామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News