: ఉత్తరకొరియా తీరు మా ఊహలకంటే ప్రమాదకరంగా ఉంది.. సమయం మించిపోతోంది!: అమెరికా
తాము ఊహించిన దానికంటే ఉత్తరకొరియా తీరు ప్రమాదకరంగా ఉందని అమెరికా పేర్కొంది. ఈ నెల 4న ఉత్తరకొరియా పరీక్షించిన ఖండాంతర క్షిపణి చాలా వేగవంతమైందని... ఇప్పటి వరకు ఆ దేశం ప్రయోగించిన అణ్వస్త్రాలకంటే ఇది ప్రమాదకరమైనదని అమెరికా ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మార్క్ మిల్లీ తెలిపారు. అత్యాధునిక పరిజ్ఞానం కలిగిన వారు కూడా ఊహించలేని క్షిపణి ఇది అని చెప్పారు.
ఉత్తర కొరియాపై సైనిక చర్య తీసుకోకుండానే సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని... అయితే సమయం మించిపోయే అవకాశం కూడా ఉందని మార్క్ మిల్లీ తెలిపారు. రోజురోజుకూ ఉత్తర కొరియా ప్రమాదకరంగా మారుతోందని చెప్పారు. వారాలు గడుస్తున్న కొద్దీ ఆ దేశం ప్రమాదానికే ప్రమాదకరంగా తయారవుతోందని అభిప్రాయపడ్డారు. అణుసామర్థ్యం గల, ప్రమాదకరమైన ఐసీబీఎం అనే ఆయుధాన్ని తాము ఊహించిన సమయం కంటే ముందుగానే ఉత్తర కొరియా రంగంలోకి దించే అవకాశం ఉందని తమ ఢిఫెన్స్ విభాగం చెప్పినట్టు ఆయన తెలిపారు.