: ఓవర్ స్పీడ్, రాంగ్ పార్కింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్... రవితేజ ప్రయాణించిన కారుకు ఆరు చలాన్లు!
ఈ ఉదయం హీరో రవితేజ, నిర్మాత నల్లమలుపు బుజ్జి పేరిట రిజిస్టరై ఉన్న హ్యుందాయ్ (టీఎస్ 09 ఈఎల్ 3334) కారులో సిట్ కార్యాలయానికి బయలుదేరిన సంగతి తెలిసిందే. ఇక ఈ కారుపై గడచిన ఏడాది వ్యవధిలో ఆరు పోలీస్ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఓవర్ స్పీడుతో దూసుకెళ్లడం, ఎక్కడబడితే అక్కడ రాంగ్ పార్కింగ్ చేయడం, కారును నడుపుతున్న వారు సెల్ ఫోన్ మాట్లాడుతూ పట్టుబడటం వంటి చలాన్లు కారుపై ఉన్నట్టు హైదరాబాద్ ట్రాఫిక్ ఈచలాన్ వెబ్ సైట్ వెల్లడిస్తోంది. మొత్తం రూ. 2,175ను జరిమానాగా చెల్లించాల్సి వుంది.