: రాత్రంతా స్టార్ హోటల్ లో... నల్లమలుపు బుజ్జి కారులో సిట్ ఆఫీసుకు రవితేజ!
గత రాత్రంతా ఓ స్టార్ హోటల్ లో తన న్యాయవాదులతో చర్చలు జరిపిన హీరో రవితేజ, ఈ ఉదయం నిర్మాత నల్లమలుపు శ్రీనివాసరెడ్డి అలియాస్ బుజ్జికి చెందిన కారులో సిట్ కార్యాలయానికి బయలుదేరారు. మరికాసేపట్లో ఆయన నాంపల్లిలోని ఆబ్కారీ భవన్ కు వచ్చి, సిట్ విచారణను ఎదుర్కోనున్నారు. ప్రధానంగా కెల్విన్ తో పరిచయం, జిషాన్ తో జరిపిన సంభాషణలు తదితరాలపై ఆయన సమాధానాలు చెప్పాల్సి వుంటుంది. స్టార్ హోటల్ నుంచి బయలుదేరిన రవితేజ కారును ఫాలో అవుతున్న మీడియా, ఆ దృశ్యాలను లైవ్ కవరేజ్ లో చూపేందుకు పోటీ పడుతున్నాయి.