: ఎవరు కాల్చారో తెలుసు... కోలుకున్నాక చెబుతాను: విక్రమ్ గౌడ్
ఎవరు కాల్పులు జరిపారో తెలియని అంతుచిక్కని స్థితిలో ఈ తెల్లవారుజామున హైదరాబాదు, అపోలో ఆసుపత్రిలో బులెట్ గాయాలతో చేరిన ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్, కాల్చింది తనకు బాగా తెలిసిన వ్యక్తేనని సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం. తనను పరామర్శించేందుకు వచ్చిన వారితో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికిప్పుడు పేరు చెబితే తీవ్ర వివాదాలు, తన కుటుంబ పరువు ప్రతిష్ఠల సమస్యలు వస్తాయని, అందువల్ల తాను కోలుకున్న తరువాత కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరన్న చెబుతానని ఆయన అన్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతానికి ముఖేష్ కు ప్రాణాపాయం లేదని, ఆయన వెన్నెముక వద్ద ఓ బులెట్ ను వెలికితీయాల్సి వుందని అపోలో వైద్యాధికారులు వెల్లడించారు.