: కేసీఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చర్యలకు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్ల క్రితం ఓ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత, హైదరాబాద్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చర్యలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేయడం కలకలం రేపుతోంది. సెప్టెంబరు 29, 2013లో నగరంలోని షాయినాయత్ గంజ్‌లో జరిగిన విశాల గోరక్ష గర్జన సనాతన ధర్మ సభలో పాల్గొన్న రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు కేసు నమోదైంది. అలాగే ఆయనపై పలు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉండడంతో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ మహేందర్‌రెడ్డి న్యాయశాఖకు లేఖ రాశారు. ఆయన లేఖపై స్పందించిన న్యాయశాఖ చర్యలకు అంగీకరించింది.