: పోలీసుల కంటే వారే ఆరోగ్యంగా ఉన్నారు!: వర్మ మరో సెటైర్
డ్రగ్స్ వ్యవహారంలో రోజుకో ఫేస్‌బుక్ పోస్టుతో సంచలనం సృష్టిస్తున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులు పోలీసుల కంటే ఆరోగ్యంగా కనిపిస్తున్నారని పేర్కొన్నాడు. పూరీ, తరుణ్, సుబ్బరాజు, నవదీప్, చార్మి తదితరులు విచారణ అధికారుల కంటే ఆరోగ్యంగా కనిపిస్తున్నారని, దీనిపై అకున్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందన్నాడు. మహిళా దర్యాప్తు అధికారుల కంటే చార్మీ, ముమైత్ ఖాన్‌లే ఆరోగ్యంగా ఉన్నారన్నాడు. కాగా, చార్మీని ఝాన్సీలక్ష్మీ బాయితో పోల్చడాన్ని ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పు పట్టారు.