: ఫ్లాష్: మాజీమంత్రి ముకేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్‌పై కాల్పులు.. తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు


తెలంగాణకు చెందిన మాజీమంత్రి ముకేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్‌పై ఈ తెల్లవారుజామున కాల్పులు జరగడం హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తోంది. గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. రెండు బులెట్లు ఆయన శరీరంలోకి దూసుకెళ్లాయి. విక్రమ్ చేయి, కడుపులోకి బులెట్లు చొచ్చుకుపోయినట్టు తెలుస్తోంది. వెంటనే ఆయనను జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు.

రాత్రి 12:30 గంటల తర్వాత ఇంటికి వచ్చిన విక్రమ్ నేడు పూజలో పాల్గొనాల్సి ఉండడంతో నిద్రపోయారు. తెల్లవారుజామునే లేచి పూజ కోసం సిద్ధమవుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి వచ్చి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాల్పుల ఘటనపై పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

  • Loading...

More Telugu News